ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది.

By అంజి  Published on  11 Oct 2024 8:54 AM IST
Meteorological Department, cyclone, APnews, Heavy rains

ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. అది పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనున్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత అది వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి.. ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో తీరే దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇది తుపానుగా బలపడి ఏపీ దక్షిణ కోస్తా లేదా ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15వ తేదీన తీరం దాటొచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

Next Story