బైక్ ఆపి మ‌రీ త‌న‌ను వేధించిన వ్య‌క్తికి.. దేహ‌శుద్ధి చేసిన మ‌హిళ‌.. ధైర్యాన్ని మెచ్చుకుంటున్న నెటిజ‌న్లు

Men tries to assault a woman, beaten up in Vijayawada. బైక్ ఆపి మ‌రీ త‌న‌ను వేధించిన వ్య‌క్తికి.. దేహ‌శుద్ధి చేసిన మ‌హిళ‌.. ధైర్యాన్ని మెచ్చుకుంటున్న

By Medi Samrat  Published on  29 April 2022 2:21 PM IST
బైక్ ఆపి మ‌రీ త‌న‌ను వేధించిన వ్య‌క్తికి.. దేహ‌శుద్ధి చేసిన మ‌హిళ‌.. ధైర్యాన్ని మెచ్చుకుంటున్న నెటిజ‌న్లు

బైక్ ఆపి మ‌రీ త‌న‌ను వేధించిన వ్య‌క్తికి.. దేహ‌శుద్ధి చేసిన మ‌హిళ‌.. ధైర్యాన్ని మెచ్చుకుంటున్న నెటిజ‌న్లుతనను వేధించడానికి ప్రయత్నించిన వ్యక్తికి విజయవాడలో ఓ యువతి తగిన గుణపాఠం చెప్పింది. యువ‌తి ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొంది. వివరాల్లోకి వెళితే గన్నవరం ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న యువతి రాత్రి ఇంటికి వెళ్తుండగా.. ఓ వ్యక్తి బైక్ ఆపి వేధింపులకు పాల్పడ్డాడు. అయితే, అప్రమత్తమైన యువతి రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకుని అతడిపై తిరగబడి కొట్టింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

యువతి దుండగుడిని కొడుతున్న దృశ్యాన్ని రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. యువతి ధైర్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఏపి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి ప‌ద్మ ఈ విష‌య‌మై ట్విట‌ర్ వేదిక‌గా స్పందించారు. మహిళ ధైర్యంగా ఉందని, ఊహించని సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారని అభినందించారు.

Next Story