నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘనవిజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అయిన మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటికి నుంచి వైసీపీ అభ్యర్థి అయిన విక్రమ్‌రెడ్డి తన ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. మొత్తంగా 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండర్‌లోనూ విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు.
మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నెల 23న పోలింగ్ జరిగింది. మొత్తం 2,13,338 మంది ఓటర్లు ఉండగా.. 1,37,081 మంది ఓట్లరు ఓటు వేశారు. మొత్తం పోలైన ఓట్లలో విక్రమ్‌రెడ్డికి 1,02,240 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌కు 19,352 ఓట్లు వచ్చాయి. ఇక.. పోస్టల్ బాలెట్‌లో 215 ఓట్లకు గానూ వైసీపీ 167 ఓట్లు వచ్చాయి.