ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సీఎం జగన్‌ను చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని అనిపిచేందని, వైఎస్సార్ లేని లోటు తీరుస్తారని చెప్పానన్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, మళ్లీ ఛాన్స్ రానే వస్తుందని, అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పానన్నారు. ప్రజలు వైఎస్ జగన్ భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారని అన్నారు. అయితే సీఎం జగన్ ప్రజలను అభిమానం పొందాలని కానీ వారిని మోసం చేయొద్దన్నారు. అలాంటి నాయకుడే ఉండొద్దంటూ మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల సొమ్ముకు పాలకులు ధర్మకర్తలు మాత్రమేనన్నారు. ప్రజలను ప్రజలకే అప్పగించాలని మేకపాటి సూచించారు. ప్రజలకు వైద్యం, విద్య, సాగు నీరు, తాగునీరుతో పాటు పథకాలు అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో.. రాష్ట్రం చాలా నష్టపోయిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చాలా కష్టపడి పని చేయాలని గౌతమ్‌రెడ్డికి సూచించానని రాజమోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం 974 కిలోమీటర్ల తీరం ఉందని, పోర్టులు, హార్బర్లు ఏర్పాటు చేసి పెట్టుబడులు తేవాలని చెప్పేవాడినన్నారు. హైదరాబాద్ తరహాలో రాష్ట్ర రాజధానిని అభివృద్ధి చేయాలన్నారు.