మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్.. అందరికీ ఆహ్వానం పలికిన మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారం, పాఠశాలల బలోపేతం, విద్యార్థులు రాణించేలా తీసుకోవాల్సిన చర్యల గురించి డిసెంబర్ 7న ఏపీ వ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

By Kalasani Durgapraveen  Published on  30 Nov 2024 6:14 AM GMT
మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్.. అందరికీ ఆహ్వానం పలికిన మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా రంగాన్ని పీడిస్తున్న సమస్యల పరిష్కారం, పాఠశాలల బలోపేతం, విద్యార్థులు రాణించేలా తీసుకోవాల్సిన చర్యల గురించి డిసెంబర్ 7న ఏపీ వ్యాప్తంగా నిర్వహించనున్న మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య వారధిని నిర్మించడానికి, పిల్లల అభ్యాస సామర్థ్యాలను అంచనా వేయడానికి, వారి సమస్యలను గుర్తించడానికి ఈ సమావేశాన్నిఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో తెలిపారు.

డిసెంబరు 7న జరిగే సమావేశాలకు అందరూ రాజకీయాలకతీతంగా హాజరుకావాలని, విద్యావేత్తల స్థాయి పెరగాలని లోకేష్ కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు నిర్దిష్ట క్రీడలు లేదా కళల పట్ల ఉన్న ఆసక్తి గురించి ఉపాధ్యాయులకు తెలియజేయాలని కోరారు. వార్డు నుంచి పార్లమెంట్‌ స్థాయి వరకు, సర్పంచ్‌ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రజాప్రతినిధులందరూ ఈ సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Next Story