అమరావతి: రాష్ట్రంలో 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇవాళ ఉదయం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు డీఎస్సీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలిపే వీడియోను మంత్రి నారా లోకేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు. https://cse.ap.gov.in/ https://apdsc.apcfss.in సైట్ల ద్వారా అప్లై చేసుకోవచ్చు. వ్యక్తిగత, విద్యార్హతలు, టెట్, బీఈడీ లాంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 16,347 టీచర్ పోస్టులకు నేటి నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.