మార్కాపురం బస్సు ప్రమాదం.. యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు పోయాయి.

By -  Medi Samrat
Published on : 27 March 2026 3:48 PM IST

మార్కాపురం బస్సు ప్రమాదం.. యజమాని అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు పోయాయి. ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే బస్సు డ్రైవర్ యువరాజుతో పాటు యజమాని హరికృష్ణను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రైవర్‌ను ప్రధాన నిందితుడిగా చేరుస్తూ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదు చేశారు.

తెలంగాణ నుంచి నెల్లూరు జిల్లాకు వెళుతున్న ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టిన ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25మందికిపైగా గాయాలయ్యాయి.

Next Story