ఆంధ్రా సరిహద్దులో రెచ్చిపోయిన మావోయిస్టులు

ఆంధ్రా బోర్డర్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జగదల్‌పూర్‌ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆసీర్‌గూడెం వద్ద మావోయిస్టులు అడ్డుకుని దగ్ధం చేశారు.

By అంజి
Published on : 21 Dec 2023 7:40 AM IST

Maoists, fire, bus fire, Andhra border

ఆంధ్రా సరిహద్దులో రెచ్చిపోయిన మావోయిస్టులు

ఆంధ్రా బోర్డర్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో జగదల్‌పూర్‌ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును గత రాత్రి ఆసీర్‌గూడెం వద్ద మావోయిస్టులు అడ్డుకుని దగ్ధం చేశారు. బుధవారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే మరో రెండు ట్రక్కులను, ఓ కారును డీజిల్ పోసి తగలబెట్టారు. చింతూరుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఆసీర్‌ గూడెం వద్ద తాగునీరు కోసం ప్రయాణికులు దిగిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుందని సమాచారం. ఈ సంఘటనలో ఎవరు చనిపోలేదని గాయపడలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్‌ ఇవాళ అల్లూరి జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.


Next Story