2019 ఎన్నికల అనంతరం టీడీపీలో చేరిన మానుకొండ జాహ్నవిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేయడమైంది. జాహ్నవి 2013లో నమోదైన గంజాయి కేసులో నేడు అరెస్టు అయ్యారు. ఈ కేసులో తుదితీర్పు వచ్చి, నిజనిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంది. ఈ మేరకు బచ్చల అర్జునుడు ప్రకటన చేశారు.