వైసీపీలో చేరిన మంగళగిరి టీడీపీ కీల‌క‌ నేత

Mangalagiri TDP leader Ganji Chiranjeevi joins YSRCP party in the presence of YS Jagan. మంగళగిరి టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

By Medi Samrat  Published on  29 Aug 2022 3:01 PM IST
వైసీపీలో చేరిన మంగళగిరి టీడీపీ కీల‌క‌ నేత

మంగళగిరి టీడీపీ కీలక నేత గంజి చిరంజీవి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో కృషి చేస్తుందన్నారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీకి బీసీలంటే గౌరవం లేదని.. టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు ఏ సామాజిక వర్గానికి గౌరవం లేదని విమర్శించారు.

టీడీపీలో అత్యధికులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని ఆరోపించిన ఆయన.. ఎన్టీఆర్ ఆశయాలకు వెన్నుపోటు పొడిచారని, బీసీలను పార్టీలో దూరం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు.






Next Story