37 ఏళ్ల వయసులోనే నటుడు నిర్మల్ కన్నుమూత

మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూశారు. ఆగస్టు 23, శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు

By Medi Samrat  Published on  23 Aug 2024 7:15 PM IST
37 ఏళ్ల వయసులోనే నటుడు నిర్మల్ కన్నుమూత

మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ కన్నుమూశారు. ఆగస్టు 23, శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. అతనికి 37 సంవత్సరాలు. ఈ విషయాన్ని నిర్మాత సంజయ్ పడియూర్ సోషల్ మీడియా పోస్ట్‌లో ధృవీకరించారు. నిర్మల్ బెన్నీ తిరువనంతపురంలోని తన నివాసంలో మరణించారు. నిర్మల్ 'ఆమెన్' చిత్రంలో కొచ్చాచన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'నవగాథార్కు స్వాగతం' సినిమాతో తెరంగేట్రం చేసిన నిర్మల్ 'దూరం' చిత్రంలో కూడా కనిపించారు.

లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించిన చిత్రం 'ఆమెన్'లో కొచ్చాచన్ అనే జూనియర్ ప్రీస్ట్ పాత్రలో శక్తివంతమైన నటనకు బెన్నీ ప్రశంసలు దక్కించుకున్నారు. 2012లో 'నవగాథార్కు స్వాగతం' సినిమాతో అరంగేట్రం చేశాడు. నిర్మల్ 'ఆమెన్', 'దూరం' సహా ఐదు చిత్రాలలో నటించాడు. ఆన్‌లైన్‌లో YouTube వీడియోలలో అతని ప్రదర్శనల ద్వారా మంచి పేరును సొంతం చేసుకున్నాడు.

Next Story