ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసి బావికి రీ డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ భారీగా ముడిచమురు, గ్యాలీ లీకై భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా చమురు వాసన వ్యాప్తి చెందుతోంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ప్రమాద భయంతో సమీపంలోని నివాసితులు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.