ఒంగోలు పార్లమెంట్ సీటు రేసు నుంచి త‌ప్పుకున్న మాగుంట రాఘవ

టీడీపీ నేత మాగుంట రాఘవ రెడ్డి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు.

By Medi Samrat  Published on  25 March 2024 3:54 PM GMT
ఒంగోలు పార్లమెంట్ సీటు రేసు నుంచి త‌ప్పుకున్న మాగుంట రాఘవ

టీడీపీ నేత మాగుంట రాఘవ రెడ్డి లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. ఈసారి తన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున సీనియర్‌ సభ్యుడు గెలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన నిధులను అభ్యర్థించడం సులువవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ క్యాడర్ సమర్ధవంతంగా పనిచేసి విజయం సాధించాలని రాఘవరెడ్డి కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈసారి టీడీపీ ఒంగోలు టికెట్ రాఘవకు ఇస్తుందని ఊహాగానాలు వచ్చాయి. రాఘవ, అతని తండ్రి ఇద్దరూ ఇటీవల వైఎస్సార్సీపీ నుండి పార్టీ ఫిరాయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో రాఘ‌వ పేరుండ‌గా.. అప్రూవర్‌గా మారారు. రాఘవ ఒప్పుకోలు స్టేట్‌మెంట్ ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లను అరెస్టు చేసిన‌ట్లుగా నివేదిక‌లు చెబుతున్నాయి.

Next Story