ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో, నిన్న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది.

By అంజి  Published on  8 Dec 2024 1:45 AM GMT
Low pressure, Southeast Bay of Bengal, Heavy rains, AndhraPradesh

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో, నిన్న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంకు చేరే అవకాశం ఉందని పేర్కొంది.

నేడు శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరి, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆగ్రేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ ణశాఖ తెలిపింది. ఇది 1న శ్రీలంక - తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో 12న ఏపీలోకి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

Next Story