ఏపీలో ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో స్థానిక ఎన్నికలు జరుగనున్నాయి. 14వ తేదీన పంచాయతీలకు, 15న మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు, 16న ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఇక 14వ తేదీనే పంచాయతీలకు కౌంటింగ్ ఉంటుంది. 17వ తేదీన మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు కౌంటింగ్ చేపడతారు. 18వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కౌంటింగ్ ఉంటుంది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69 సర్పంచ్ పదవులకు, 533 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
రాష్ట్ర మొత్తం మీద వివిధ కారణాలతో 187 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ పరిధలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇక గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఆరు మున్సిపల్ కార్పోరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్లకు.. 12 మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల్లో ఎన్నికలు జరుగనన్నాయి. ఈ మేరకు ఏపీ ఎస్ఈజీ షెడ్యూల్ విడుదల చేశారు. అన్ని స్థానిక సంస్థలకు ఈనెల 3 నుంచి 5 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.