Andhrapradesh: మద్యం షాపుల బంద్‌ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి చేపట్టాల్సిన మద్యం షాపుల బంద్‌ను వాయిదా వేస్తున్నట్టు బేవరేజ్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం తెలిపింది.

By అంజి  Published on  5 Sep 2024 6:49 AM GMT
Liquor shops bandh, Andhra Pradesh, APnews

Andhrapradesh: మద్యం షాపుల బంద్‌ వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ నుంచి చేపట్టాల్సిన మద్యం షాపుల బంద్‌ను వాయిదా వేస్తున్నట్టు బేవరేజ్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రామచంద్రరావు, జి.కోటేశ్వరరావు బుధవారం తెలిపారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

మద్యం షాపుల్లో పని చేస్తున్న సూపర్‌ వైజర్లు, సేల్స్‌మెన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో బంద్‌ చేపడతామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం చంద్రబాబు లేఖ కూడా రాశారు. గత ప్రభుత్వం తమను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసిందని, ఇప్పుడు ఆ ఉద్యోగం పోయే పరిస్థితి నెలకొందని చెప్పారు. నూతన మద్యం పాలసీ వస్తే 15 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడతారని, ప్రభుత్వం న్యాయం చేయాలని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం కోరింది.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం.. సర్కారీ మద్యం షాపులకు గుడ్‌బై చెప్పడానికి సిద్ధం అయ్యిందని సమాచారం. పూర్తిగా ప్రయివేటు షాపులే ఉండేలా ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీని రూపొందిస్తోంది. ఈ మేరకు ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీని అధ్యయనం చేసి అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. తెలంగాణ తరహా పాలసీ ఉత్తమంగా ఉందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక మద్యం పాలసీకి తుది రూపు తీసుకురానున్నారు.

Next Story