ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..ఒక్క నెలలోనే రూ.2,767 కోట్లు
అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
By - Knakam Karthik |
ఏపీలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు..ఒక్క నెలలోనే రూ.2,767 కోట్లు
అమరావతి: రాష్ట్రంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత డిసెంబర్ నెలలో రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం డిసెంబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు మొత్తం మద్యం అమ్మకాలు సుమారు రూ.2,767 కోట్లుగా నమోదైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ అమ్మకాలపై నూతన సంవత్సర వేడుకల ప్రభావం ఉన్నట్లు పేర్కొన్నారు.
కాగా గత ఏడాది డిసెంబర్ 2024లో ఇవి రూ.2,568 కోట్లు ఉండగా, ఈసారి సుమారు 8 శాతం వృద్ధి నమోదైంది. ప్రత్యేకంగా డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో అమ్మకాలు భారీగా జరిగాయి. ఈ మూడు రోజుల్లో మాత్రమే 2025లో సుమారు రూ. 543 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అదే కాలంలో 2024లో అమ్మకాలు రూ.336 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం. నూతన సంవత్సర వేడుకలు, సెలవులు ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే
విశాఖపట్నం జిల్లా డిసెంబర్ నెలలో అత్యధికంగా సుమారు రూ. 178.6 కోట్లు అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత తిరుపతి జిల్లా సుమారు రూ. 169.4 కోట్లు, ఎన్‌టీఆర్ జిల్లా సుమారు రూ. 155.4 కోట్లు అమ్మకాలతో ముందంజలో ఉన్నాయి. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా సుమారు రూ. 30.7 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లా సుమారు రూ. 35.4 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లా సుమారు రూ. 65 కోట్లు మాత్రమే అమ్మకాలతో తక్కువ స్థాయిలో నిలిచాయి.