మద్యం ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik
మద్యం ధరలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరల పెంపుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019-2024 మధ్యలో మద్యం విషయంలో జగన్ ఏం చేశాడో అందరూ చూశారని అన్నారు. మద్యం పాలసీపై పారదర్శకంగా ముందుకెళ్తున్నామని, గత ప్రభుత్వంలో అధికంగా ధరలు పెంచారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పనికిమాలిన చెత్త మద్యం అమ్మకాలు చేసిందని ఎద్దేవా చేశారు. రిటైలర్ మార్జిన్ 15 శాతం ఉండాలని తాము భావించామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రతి బాటిల్‌పై రూ.10 మాత్రమే పెంచినట్లు స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. అన్ని అక్రమాలు బయటికి వస్తాయనే వైసీపీ వాళ్లు భయపడుతున్నారని విమర్శించారు. కల్లు గీత కులాలకు 10 శాతం మద్యం షాపులు కేటాయించామని..కోర్టుల్లో కేసులు వేసి వైసీపీ అడ్డుకోవాలని చూస్తూ..బీసీలకు అన్యాయం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 కొత్త బ్రాండ్లు తెచ్చినట్లు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఏ మద్యం కావాలో వారే ఇండెంట్ పెట్టుకుంటారని, సిండికేట్ మద్యం అమ్మకాలు చేసింది జగన్ అంటూ ఫైర్ అయ్యారు. డిస్టలరీస్‌పై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్న మంత్రి కొల్లు రవీంద్ర..బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో మద్యం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చారని విమర్శించారు.