Andhrapradesh: నేడే కొత్త వైన్‌షాపులు ప్రారంభం.. త్వరలో పర్మిట్‌ రూమ్‌లు?

రాష్ట్ర నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం అక్టోబర్ 16 బుధవారం నుంచి మళ్లీ ప్రైవేటు రంగానికి చెందనుంది.

By అంజి  Published on  16 Oct 2024 1:28 AM GMT
Liquor business,  Andhrapradesh, private Liquor business, APnews

Andhrapradesh: నేడే కొత్త వైన్‌షాపులు ప్రారంభం.. త్వరలో పర్మిట్‌ రూమ్‌లు?

అమరావతి: రాష్ట్ర నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం అక్టోబర్ 16 బుధవారం నుంచి మళ్లీ ప్రైవేటు రంగానికి చెందనుంది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లాటరీ విధానం ద్వారా లభించే మద్యం దుకాణాలు తక్కువ ధరలకు అధిక నాణ్యత గల మద్యాన్ని అందజేస్తాయి.

మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్‌ రూమ్‌లకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు రూ.5 లక్షలు ఫీజుగా వసూలు చేస్తుందని సమాచారం. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. నేటి నుంచి రాష్ట్రంలో 3,396 ప్రైవేట్‌ మద్యం దుకాణాలు తెరుచుకుంటాయి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయిస్తారు. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి.

గత వైఎస్సార్‌సీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో 113 ప్రైవేట్ మద్యం దుకాణాలను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొంత మంది ప్రైవేట్ డీలర్లు ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల నుంచి తమ కార్యకలాపాలను నిర్వహిస్తుండగా, చాలా మంది తమ మద్యం దుకాణాలను కొత్త ప్రదేశాల్లో తెరవడానికి ఎంచుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ, ప్రీమియం మద్యం బ్రాండ్‌లన్నీ నేటి నుంచి ప్రైవేట్‌ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంటాయని నిడమనూరు మద్యం డిపో మేనేజర్‌ ఎం. సునీత తెలిపారు.

రూ.99 ధర గల 180 ఎంఎల్ మద్యం బాటిళ్లు త్వరలో కొత్త మద్యం షాపుల్లో అందుబాటులో ఉంటాయని ఆమె హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని దుకాణాలు, బార్‌లకు సరిపడా మద్యం అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు. నివేదికల ప్రకారం, కస్టమర్లకు ఒక్కొక్కటి రూ.99 చొప్పున విక్రయించడానికి సుమారు రెండు లక్షల కేసుల క్వార్టర్ బాటిళ్లను సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని డిస్టిలరీలను సంప్రదించింది. ప్రస్తుతం ఉన్న మద్యం ధరలను సమీక్షించి, తగ్గింపు ధరలను ప్రతిపాదించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేయనున్నట్లు సమాచారం.

Next Story