ఆంధ్రప్రదేశ్‌లో రేపు (శనివారం(01-11-2025) కొన్నిచోట్ల  పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.  
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉందని పేర్కొన్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. కృష్ణా, పెన్నా, ఇతర ఉపనదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.