Video: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది.
By Knakam Karthik
Video: తిరుమలలో మరోసారి చిరుత పులి సంచారం
తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ వద్ద గంగమ్మ గుడి సమీపంలోకి అర్ధరాత్రి చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆలయం పరిసరాల్లో సోమవారం రాత్రి చిరుత సంచరించింది. అక్కడున్న ఓ పిల్లి మీద దాడి చేసేందుకు చిరుత యత్నించింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరుత సంచారంపై ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు ఆలయం వద్దకు చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టారు. భక్తులను అప్రమత్తం చేశారు.
కాగా తిరుమలలో చిరుతపులుల సంచారం ఎక్కువైపోవడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా అలిపిరి నడక మార్గంలోనూ, ఘాట్ రోడ్డులోనూ చిరుతలు కనిపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ, ఫారెస్ట్ ఆఫీసర్లు చర్యలు చేపడుతున్నా చిరుతలు ఎక్కడో ఒక చోట సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డవుతున్నాయి.