సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు
Leaders of AP JAC Amaravati union met CS Jawahar Reddy. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు.
By Medi Samrat Published on 28 Feb 2023 6:23 PM ISTఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ.. తమ ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందజేశారు. ఉద్యోగుల ఆర్థికపరమైన, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమం చేపడుతున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలవుతుందని వెల్లడించారు.
ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాటపట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ నిరసనలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని.. అప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈసారి చాయ్ బిస్కట్ సమావేశాలతో రాజీపడే ప్రసక్తేలేదని.. తాము అనుకున్నది సాధించి తీరుతామని అన్నారు.
ఏపీ ఉద్యోగ సంఘాల నిరసనల షెడ్యూల్ ఇదే :
మార్చి 8,9 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన
మార్చి 13,14 తేదీల్లో జిల్లా కలెక్టరెట్‌లు, ఆర్డీవో ఆఫీస్‌ల ముందు లంచ్ బ్రేక్‌లో ఆందోళనలు
మార్చి 15,17,20తేదీల్లో అన్నీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు జేఏసీలోని అన్నీ ఉద్యోగ సంఘాలతో ధర్నాలు
మార్చి 21నుంచి వర్క్ టు రూల్ (ఉ.10.30నుంచి సా.5గంటల వరకే పని)
మార్చి 21న ఉద్యోగుల సెల్ డౌన్
మార్చి 24న రాష్ట్రంలోని హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ ఆఫీసుల వద్ద ధర్నా
మార్చి 27న కరోనా సమయంలో, తర్వాత చనిపోయిన ఉద్యోగుల కుటుబాలకు భరోసా
ఏప్రిల్ 1వ తేదిన ఏప్రిల్ ఫూల్ డే కాబట్టి (రిటైర్మెంట్, సర్వీస్ బెనిఫిట్స్‌పై పోరాటం)
ఏప్రిల్ 3న అన్నీ జిల్లాల్లో ఛలో స్పందన కార్యక్రమాలు.కలెక్టర్లకు మెమోరండం సమర్పణ
ఏప్రిల్ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలు