వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కారదర్శి లక్ష్మీపార్వతి నారా లోకేష్‌ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న పోసానిని ఇబ్బంది పెడుతున్నారని, నారా లోకేష్‌ను అదుపులో పెట్టకపోతే రానున్న కాలంలో చంద్రబాబుకు కష్టాలు తప్పవని అన్నారు. పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని లక్ష్మీపార్వతి అన్నారు. పోసాని ఆసుపత్రికి తరలింపులో కూడా ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని లక్ష్మీ పార్వతి తెలిపారు.