ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి భూముల మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగనున్నాయి. కొత్త ధరలు రేపటి నుండి అమల్లోకి వస్తాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో మూడు సార్లు భూముల మార్కెట్ ధరలు పెంచి నవిషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన 10 నుంచి 20 శాతం పెంపు ఉండనుంది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌లో రిజిస్ర్టేషన్ల శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు.
భూముల మార్కెట్ ధరలు పెంచడం వల్ల ఫిబ్రవరి, మార్చిల్లో ఆదాయం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో నిర్మాణ విలువలపైనా 6 శాతం వరకు పెంపు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేసింది. దీని ప్రకారం.. పెంకుటిళ్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి చదరపు అడుగుకు రూ.740, రూ.580, రూ.420 వసూలు చేస్తారు. ఫ్లాట్‌లకు (గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్) రూ.1490, రూ.1270, రూ.900 వసూలుకు నిర్ణయించారు.