AP తెలుగు అకాడమీ చైర్మన్, దివంగత N.T రామారావు భార్య లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారకరత్న మరణాన్ని కూడా తెలుగు దేశం పార్టీ రాజకీయాలు చేసిందని, తారకరత్న చనిపోయిన చాలా రోజులకు ఆ విషయాన్ని బయటపెట్టారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడిందని లక్ష్మీపార్వతి ఆదివారం ఆరోపించారు. చంద్రబాబు కుమారుడు పాదయాత్ర లోకేష్ పాదయాత్రను ప్రజలు అపశకునంగా భావిస్తారనే ఉద్దేశంతోనే చనిపోయన తారకరత్నను ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచి అతని భార్య, పిల్లలు, తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు లక్ష్మీపార్వతి.
యువ నటుడి అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆమె.. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు మా కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం అవలంభించాడని.. నారా లోకేష్ పాదయాత్రకు, లోకేష్‌కు చెడ్డ పేరు వస్తుందని తారకరత్న మరణవార్తను ఇన్నాళ్లు దాచిపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్ధ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని అన్నారు. రెండు రోజులు పాదయాత్ర వాయిదా వేసినప్పడే మరణ వార్త ప్రకటించి ఉండాలి. ప్రజలు అపశకునంగా భావిస్తారని ఇన్నాళ్లు డ్రామా చేశారు. తండ్రీకొడుకులు రాష్ట్రానికే అపశకునం అని ప్రజలకు తెలుసని అన్నారు. చంద్రబాబు నీచమైన రాజకీయాలు చేయడం మానేస్తేనే నందమూరి కుటుంబం బాగుపడుతుందని వ్యాఖ్యలు చేశారు.