కేటీఆర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించాలి

KTR's birthday celebrations at Vijayawada BRS office. విజయవాడ బీఆర్ఎస్ కార్యాల‌యంలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి.

By Medi Samrat
Published on : 24 July 2023 4:11 PM IST

కేటీఆర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించాలి

విజయవాడ బీఆర్ఎస్ కార్యాల‌యంలో కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. విజయవాడ సింగ్ నగర్‌లో ఉన్న‌ బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో ఏపీ బీఆర్ఎస్ సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ కేక్ కట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కొణిజేటి ఆదినారాయణ మాట్లాడుతూ.. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఆయనకు ఉండాలని కోరుకుంటున్నామ‌న్నారు. భవిష్యత్తులో ఆయ‌న‌ మరిన్ని మంచి పదవుల్లో కొలువు తీరాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు ఏపీ బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్‌ను కోరారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ బీఆర్ఎస్‌ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా పీహెచ్‌డీ చేసిన భారతికి ల్యాప్ టాప్ కానుకగా అందజేసిన‌ట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏది చదివినా.. మా వంతు సాయం అందిస్తామని మా అధ్యక్షుడు చెప్పారని తెలియ‌జేశారు.


Next Story