ప్రారంభ‌మైన 'కౌలు రైతుల భ‌రోసా యాత్ర'.. రామకృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ప‌వ‌న్‌

Koulu Rythu Bharosa Yatra Starts from Sathya sai District.ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల‌ కుటుంబాల‌ను ఆదుకోవ‌డ‌మే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2022 6:44 AM GMT
ప్రారంభ‌మైన కౌలు రైతుల భ‌రోసా యాత్ర.. రామకృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ప‌వ‌న్‌

ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల‌ కుటుంబాల‌ను ఆదుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా జ‌న సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన కౌలు రైతు భ‌రోసా యాత్ర ప్రారంభ‌మైంది. శ్రీ స‌త్య‌సాయి జిల్లా కొత్త‌చెరువు విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీలో అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రామ‌కృష్ణ కుటుంబాన్ని ప‌వ‌న్ ప‌రామ‌ర్శించారు. రామ‌కృష్ణ‌ భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్‌ అందజేశారు.

త‌న భ‌ర్త చ‌నిపోయిన త‌రువాత తన కుటుంబాన్ని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం నుంచి ఎటువంటి సాయం అంద‌లేద‌ని సుజాత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జ‌న‌సేన‌ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ హామీ ఇచ్చారు. ప‌వ‌న్‌తో వెంట‌ జ‌న‌సేన‌ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి.సి.వరణ్ త‌దిత‌రులు ప‌వ‌న్ వెంట ఉన్నారు.

కొత్తచెరువు నుంచి ప్రారంభ‌మైంది కౌలు రైతు భ‌రోసా యాత్ర. అనంత‌రం ధ‌ర్మ‌వ‌రం మండ‌లంలోని గొట్లూరు గ్రామానికి ప‌వ‌న్ చేరుకోనున్నారు. ఆ త‌రువాత అనంత‌పురం రూర‌ల్ మండ‌లం పూల‌కుంట‌, మ‌న్నీల గ్రామ‌ల‌ను చేరుకుంటారు. అన్ని ప్రాంతాల్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్నారు. అనంత‌రం మ‌న్నీల గ్రామంలో ర‌చ్చ‌బండ ను నిర్వ‌హించ‌నున్నారు. అక్క‌డ మ‌రికొంత మందరు కౌలు రైతు కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించి వారి కుటుంబ ప‌రిస్థితులు తెలుసుకుంటారు. అనంత‌రం తిరిగి హైదరాబాద్ కు వెళ్ల‌నున్నారు.

Next Story