కొణతాల రామకృష్ణ సేవలు పార్టీకి ఉపయోగకరం: పవన్ కళ్యాణ్

కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరడాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

By Srikanth Gundamalla  Published on  21 Jan 2024 6:00 PM IST
konathala ramakrishna, janasena, pawan kalyan, andhra pradesh,

కొణతాల రామకృష్ణ సేవలు పార్టీకి ఉపయోగకరం: పవన్ కళ్యాణ్

కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరడాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఆయన సేవలు జనసేన పార్టీకి ఉపయోగపడతాని చెప్పారు. జనసేన పార్టీలో చేరేందుకు కొణతాల నిర్ణయించుకోవడం హర్షణీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. సుదీర్ఘకాలంగా కొణతాల రామకృష్ణ రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. అలాంటి నాయకుడు జనసేన పార్టీలో చేరడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు.

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత ఉన్న నాయకుడు కొణతాల రామకృష్ణ అని పవన్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు , పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల సేవలు దోహదమవుతాయని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

కాగా.. పవన్‌ కళ్యాణ్‌తో కొణణతాల రామకృష్ణ ఇటీవల సమావేశం అయ్యారు, ఏపీలో రాజకీయ పరిస్థితులు, ఉత్తరాంధ్రలో రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇక మంచి రోజు చూసకుని జనవరి నెలలోనే జనసేనలో కొణతాల చేరనున్నట్లు తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగాలని కొణతాల రామకృష్ణ భావిస్తున్నారు.

మరి జనసేన నుంచి ఆయనకు టికెట్ లభిస్తుందా? లేదంటే ఇంకా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. మరోవైపు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలో దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఏపీలో ఎన్నికలకు ముందే రాజకీయాల్లో హీట్‌ పెరిగింది.


Next Story