టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య గొడ‌వ‌లు.. పార్టీ ఆఫీస్‌కు రమ్మ‌న్న‌ హైక‌మాండ్‌..!

తెలుగుదేశం పార్టీ నేతలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికు చేరుకున్నాయి.

By -  Medi Samrat
Published on : 23 Oct 2025 9:20 PM IST

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య గొడ‌వ‌లు.. పార్టీ ఆఫీస్‌కు రమ్మ‌న్న‌ హైక‌మాండ్‌..!

తెలుగుదేశం పార్టీ నేతలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికు చేరుకున్నాయి. ఎన్నికల టికెట్ కోసం ఎంపీ అనుచరులకు తాను డబ్బులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా ఆరోపించారు. అందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టారు కూడా!! టీడీపీ టికెట్ కోసం కేశినేని చిన్ని రూ.5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపించారు. ఆ మేరకు బ్యాంక్ స్టేట్ మెంట్ ను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీనిపై మాట్లాడనున్నారు. పార్టీ కార్యాలయానికి రావాలంటూ ఎమ్మెల్యే కొలికపూడిని, ఎంపీ చిన్నిని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలిచారు.

కొలికపూడి చేసిన ఆరోపణలపై ఎంపీ చిన్ని స్పందించారు. మొన్నటి వరకు తనను దేవుడన్నారని, ఇప్పుడు దెయ్యంలా ఎందుకు కనిపిస్తున్నానో కొలికపూడి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ వివాదం పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లిందని, వారే తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. తాను వైసీపీ నేతలతో అంటకాగే వ్యక్తిని కాదన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను విమర్శించే వారిని తాను శత్రువులుగానే పరిగణిస్తానని చిన్ని స్పష్టం చేశారు.

Next Story