టీడీపీని ఓడించి ఎన్టీఆర్ కు గిప్ట్‌గా ఇస్తా

కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు

By Medi Samrat  Published on  4 May 2024 11:17 AM IST
టీడీపీని ఓడించి ఎన్టీఆర్ కు గిప్ట్‌గా ఇస్తా

కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నాని తెలుగుదేశం పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి రావాలంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులంతా కష్టపడి గెలిపిస్తే.. ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తారని అన్నారు. చంద్రబాబు కొడుకు లోకేష్ ను అధికారంలో కూర్చోబెడతారని.. అందుకే ఎన్టీఆర్ అభిమానులు గుండెమీద చేయి వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీని ఓడించి, తన ఫ్రెండ్ ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తానని కొడాలి నాని శపథం చేశారు.

ఎన్టీఆర్ తెలుగుదేశం పగ్గాలు పట్టుకుంటేనే, అతడి అభిమానులు టీడీపీకి మద్దతివ్వాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పగ్గాలు ఎన్టీఆర్ కు రావాలంటే చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్న టీడీపీని ఓడించాలన్నారు. పెద్ద ఎన్టీఆర్ ను దుర్మార్గుడని, తెలుగుదేశం పార్టీకి పనికిరాడని మెడ పట్టి బయటకు గెంటి పార్టీని లాక్కున్న చంద్రబాబు నాయుడు.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని, టీడీపీ పగ్గాలు అప్పగించేలా ఫ్యాన్స్ బుద్ధిచెప్పాలన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ను సోషల్ మీడియాలో చంద్రబాబు తిట్టించాడని.. తన సభల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కనిపిస్తే, ఫ్యాన్స్ ను తన్నితరిమేశారన్నారు. చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్ల కోసం ఎగబడుతున్నారని ఆరోపించారు.

Next Story