మంత్రి పదవిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

Kodali Nani Comments On Minister Post. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  23 April 2022 7:35 PM IST
మంత్రి పదవిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వెంట్రుకతో సమానమని.. గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడమే ఇష్టమన్నారు. 420 గ్యాంగ్ , చంద్రబాబు దత్త పుత్రుడు, సొంత పుత్రుడు.. రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారని.. జగన్ లాంటి వ్యక్తులను పొగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని తెలిపారు. గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత.. నియోజకవర్గంలో జరిగిన తొలి కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నానికి వైసీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

తనకు మంత్రి పదవి దక్కలేదని ఏమీ బాధ లేదని అయితే.. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానన్నారు. బాబూ జగజ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని బతికున్నంతకాలం ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. కొడాలి నాని జగన్ కేబినెట్ లో మొదటి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇటీవలే సీఎం జగన్ రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిపారు. కొడాలి నానికి మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అందరు భావించారు. కానీ కొడాలి నానికి మంత్రి పదవి దక్కలేదు.

Next Story