నంద్యాల‌ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత‌ భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్‌ కేసు నమోదైంది. బ్రహ్మానందరెడ్డితో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు ‌కేసు నమోదు చేశారు. విజయ డైయిరీ ఎన్నికల విషయంలో తనను కిడ్నాప్‌ చేశారని.. త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు మల్లికార్జున్‌ ఫిర్యాదు చేశారు. దీంతో భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు విజ‌య డైరీ చైర్మ‌న్ భూమా నారా‌య‌ణ‌రెడ్డి, భూమా వీర‌భ‌ద్ర‌రెడ్డి, బాలీశ్వ‌ర్ రెడ్డిపై కేసు న‌మోదు చేశారు. బాధితుడు మల్లికార్జున్ విజయ డైయిరీ ఎన్నికలలో డైరెక్టర్‌గా పోటీ చేశారు.

ఇదిలావుంటే.. భూమా కుంటుంబాన్ని ప్ర‌‌స్తుతం ప్ర‌తికూల ప‌రిస్థితులు చుట్టుముట్టాయి. కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందరెడ్డి అక్క అఖిల‌ప్రియ‌పై కిడ్నాప్ కేసు న‌మోద‌వ‌గా మొన్న‌నే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఇక ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్‌, త‌మ్ముడు జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డిలు ప‌రారీలో ఉన్నారు. భార్గ‌వ్ రామ్ ముంద‌స్తు బెయిల్ పిటీష‌న్‌ను కోర్టు కొట్టివేయ‌గా.. విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌ను నేడు సికింద్రాబాద్ కోర్టు విచారించనుంది.

ఈ నేఫ‌థ్యంలో భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్‌ కేసు న‌మోద‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌‌ర్యానికి గురిచేసింది. భూమా కుటుంబం మూడు దశాబ్దాల పాటు జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇటీవల జ‌రుగుతున్న‌ పరిణామాలతో ఆ ప్రతిష్ట కాస్తా మసకబారడం ఖ‌య‌మ‌నే అభిప్రా‌యం వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.


సామ్రాట్

Next Story