Vizag: రోగులకు అందించే ఆహారంలో పురుగులు.. కేజీహెచ్‌ ఆస్పత్రిలో ఘటన

కేజీహెచ్‌లో బుధవారం రోగులకు మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కింద ఉప్మా అందించారు. అయితే ఆ ఉప్మాలో పురుగులు ఉన్నాయని రోగి బంధువు ఆందోళనకు దిగారు.

By అంజి  Published on  2 Nov 2023 3:27 AM GMT
KGH, Hospital Food, Visakhapatnam, APnews

Vizag: రోగులకు అందించే ఆహారంలో పురుగులు.. కేజీహెచ్‌ ఆస్పత్రిలో ఘటన 

విశాఖపట్నం: కేజీహెచ్‌లో బుధవారం రోగులకు మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ కింద ఉప్మా అందించారు. అయితే ఆ ఉప్మాలో పురుగులు ఉన్నాయని రోగి బంధువు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆస్పత్రిలో సంచలనం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మూడు పూటలా ఫుడ్‌ సరఫరా చేయడానికి డైట్‌ కాంట్రాక్టర్‌ ఉన్నారు. నిన్న కార్డియాలజీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు మార్నింగ్‌ ఉప్మా ఇచ్చారు.

ఈ క్రమంలోనే పురుగుల ఆహారం వడ్డించారంటూ అనకాపల్లి జిల్లా కోటవూరట్ల మండలానికి చెందిన రోగి బంధువు ఎం. సత్యవతి ఆందోళనకు దిగారు. ఉప్మాలో తెల్లపురుగులు ఉన్నాయని ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి కారాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై విచారణకు కింగ్‌జార్జి ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్‌కుమార్‌ ఆదేశించారు. ఆసుపత్రి అధికారులకు ఆహారం చూపిస్తూ.. 'మేం ఆరోగ్యవంతులం కావడానికి ఆసుపత్రికి వచ్చాం.. ఇలాంటి ఆహారం అందిస్తే మా పరిస్థితి మరింత దిగజారుతుంది, ఇలాంటి ఆహారం ఎలా అందిస్తారు' అని సత్యవతి ప్రశ్నించింది.

ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. "మేము ఆసుపత్రి డైటీషియన్లు, సెంట్రల్ స్టెరైల్ అండ్ రీప్రాసెసింగ్ యూనిట్ ను వీలైనంత త్వరగా వివరణాత్మక నివేదికను అందించమని ఆదేశించాము. సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము" అని అశోక్ కుమార్ తెలిపారు.

Next Story