ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను
By Medi Samrat
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు…
1. ఆరోగ్య, వైద్య&కుటుంబ సంక్షేమ శాఖ:
ఆయుష్మాన్ భారత్ - PMJAY - డాక్టర్ NTR వైద్య సేవ పథకం క్రింద హైబ్రిడ్ మోడ్‌లో యూనివర్సల్ హెల్త్ పాలసీ రూపకల్పనకు భీమా కంపెనీల నుండి టెండర్లను పిలవడానికి తయారు చేసిన RFP ఆమోదం కొరకు ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ ప్రతిపాదనల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 5.00 కోట్లు మందికి నాణ్యమైన వైద్య సేవలు అందజేయబడతాయి. ఆరోగ్య సంరక్షణ ప్రాప్యత మరియు ఆర్థిక రక్షణను బలోపేతం చేసేందుకు బీమా ద్వారా కుటుంబానికి సంవత్సరానికి రూ. 2.5 లక్షల వరకు మరియు ట్రస్ట్ ద్వారా రూ. 2.5 లక్షలకు మించి రూ. 25 లక్షల వరకు కవరేజ్‌ను దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకు అందించడం మరియు దారిద్ర్య రేఖకుఎగువున ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి రూ. 2 లక్షల నుండి కుటుంబానికి 5 లక్షల వరకు బీమా కవరేజ్‌ను అందించడం ద్వారా బలోపేతం చేయబడుతుంది.
EHS లో కవర్ అయ్యే ఉద్యోగులు మినహా మిగతా వారందరికీ ఈ పథకం క్రింద వైద్య సేవలు అందజేయబడతాయి. వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పధకం క్రింద ఉన్న జర్నలిస్టులకు కూడా ఈ పథకం క్రింద వైద్య సేవలు అందజేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వారిని కూడా పరిగణలోకి తీసుకునే విధంగా ప్రయత్నించడం జరుగుతుంది. రూ.25 లక్షల వైద్య సేవలకు సంబందించిన చెల్లింపులు కూడా భీమా కంపెనీలే ప్రాసెస్ చేసి చెల్లించడం జరుగుతుంది. తదుపరి సంబందిత కంపెనీలకు ప్రభుత్వం రీ-ఇంబర్ముమెంట్ చేయడం జరుగుతుంది. ఈ పధకం ద్వారా 3,257 రకాల వైద్య సేవలు అందజేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో కేవలం 169 వైద్య సేవలే రిజర్వు చేయడం జరిగితే, ఇప్పుడు 324 వైద్య సేవలను అందజేయడం జరుగుతుంది.
పేషంట్ ఆసుపత్రిలో చేరిన తదుపరి ఆరు గంటల్లోపు అప్రూవల్ ఇచ్చే విధంగా ఈ RFP లో నిబందనను పొందుపర్చడం జరిగింది. 15 రోజుల్లోపు ఆసుపత్రులకు చెల్లించాల్సిన లావాదేవీల ప్రక్రియను పూర్తి చేయాలనే నిబంధనను పెట్టడం జరిగింది. ఈ పథకం అమల్లో ఎటు వంటి మోసాలు జరిగినా PMJAY కేంద్ర ప్రభుత్వం యాంటీ ప్రాడ్ ప్రోగ్రామ్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకునే విధంగా RFP లో పొందుపర్చడం జరిగింది. ప్రతి పేషంట్ కు ఒక క్యూఆర్ కోడ్ ను ఇచ్చి ఈ పథకం అమలు తీరును ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ఎన్.టి.ఆర్. ట్రస్టు ఆద్వర్యంలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
2. ఆరోగ్య, వైద్య&కుటుంబ సంక్షేమ శాఖ:
(ఎ) ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల మరియు పార్వతీపురంలలో 10 కొత్త వైద్య కళాశాలలలను అభివృద్ధి చేయడం ; (బి) ఫేజ్-1లో,PPP పద్ధతిలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి మరియు పులివెందులలో 4 వైద్య కళాశాలల అభివృద్ధి కోసం ముసాయిదా RFPలు, రాయితీ ఒప్పందాలకు ఆమోదం మరియు మిగిలిన 6 వైద్య కళాశాలల సాధ్యాసాధ్యాల నివేదిక, ముసాయిదా RFP మరియు రాయితీ ఒప్పందాలను ఖరారు చేసిన వెంటనే ప్రీ-బిడ్ సంప్రదింపుల ఆధారంగా RFPలో చిన్న మార్పులు చేయడానికి టెండర్ కమిటీని అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
PPPలు డిజైన్, ఫైనాన్సింగ్ మరియు అమలు ప్రమాదాలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి, ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు డబ్బుకు దీర్ఘకాలిక విలువను అందిస్తాయి. అందువల్ల, తగిన PPP నమూనా ద్వారా మొత్తం 10 వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేయబడింది. ఈ వైద్య కళాశాలలు రాష్ట్రంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సేవలను గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఈ 10 వైద్య కళాశాలల్లో 2027-28 విద్యా సంవత్సరం నుండి అడ్మిషన్లు జరిగే విధంగా ఈ కళాశాలల నిర్మాణాలను పూర్తి చేయడం జరుగుతుంది.
3. పురపాలక&పట్టణాభివృద్ధి శాఖ:
APCRDA అథారిటీ తీర్మానం నెం. 546/2025, తే.02.06.2025 ద్వారా ఆమోదించిన విధంగా 01.01.2025న లేదా ఆ తర్వాత రాజధాని నగరం అమరావతిలో భూమిని కేటాయించిన విద్యా మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు అమ్మకం/లీజు మరియు లీజు/అమ్మకం డీడ్ల ఒప్పందాలను అమలు చేసేటప్పుడు రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపు నుండి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం వల్లం మంచి పేరున్న విద్యా, వైద్య సంస్థలు ఈ అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
4. పురపాలక&పట్టణాభివృద్ధి శాఖ:
రాష్ట్రంలో తే.31.08.2025 వరకు ULBs/UDAs/ APCRDA పరిధిలో (క్యాపిటల్ సిటీ ప్రాంతం మినహా) అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు, మునిసిపల్ కార్పొరేషన్స్ చట్టం, 1955, ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీలు చట్టం, 1965, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చట్టం, 2014 మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు చట్టం, 2016 లను సవరించి డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌కు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
తే.31.08.2025 నాటికి జరిగిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 59,375 అనధికార నిర్మాణాలు, 49,936 డివియేషన్సు, 10,212 అదనపు అంతస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీటన్నింటినీ క్రమబద్దీకరించడానికి ప్రతిపాదనలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
5. పరిశ్రమలు&వాణిజ్య శాఖ:
M/s మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు M/s ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ల పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి తే.28.08.2025న జరిగిన SIPB సమావేశ చేసిన సిఫార్సులను ఆమోదించదానికి పరిశ్రమలు మరియు వాణిజ్య (ఫుడ్ ప్రాసెసింగ్) శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రూ.427 కోట్ల పెట్టుబడితో M/s మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఏర్పాటుచేస్తున్నట్లు తద్వారా 180 మంది ఉద్యోగ అవకాశలు కలుగనున్నాయి. రూ.786 కోట్ల పెట్టుబడితో M/s ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నారని, దీని ద్వారా ప్రత్యక్షంగా 1000 మంది పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి. 73.63 ఎకరాలను M/s ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు కేటాయించనున్నారు.
6. పరిశ్రమలు&వాణిజ్య శాఖ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్‌పుట్‌ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి మెస్సర్స్ స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనపై 28.08.2025న జరిగిన SIPB సమావేశ సిఫార్సులను ఆమోదించడానికి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
స్పేస్ సిటీ మరియు వాటికి సంబంధించిన తదుపరి నాలుగు ప్రధాన తయారీ ప్రతిపాదనల కోసం ఎకరానికి @రూ.5 లక్షలు కేటాయించడానికి సవరణతో ఆమోదించబడింది.
ఎర్తు స్టోరబుల్ ఇంజన్ టెస్టు ఫెసిలిటీ, క్రయోజనిక్ ఇంజన్ టెస్టు ఫెసిలిటీ, క్రయోజనిక్ ఇంజన్ టెస్టు ఫెసిలిటీ-2 సదుపాయాలను ఈ స్పేస్ సిటీలో కల్పించబడుతుంది.
7. పరిశ్రమలు&వాణిజ్య శాఖ:
పారిశ్రామిక అభివృద్ధి విధానం (4.0) 2024-29లోని ఎర్లీ బర్డ్ స్కీమ్ నిబంధనల కింద M/s బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్, M/s అదాని విల్మార్ లిమిటెడ్, M/s టైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, M/s రామ్‌షీ బయో ప్రైవేట్ లిమిటెడ్, M/s శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ మరియు M/s పట్టాభి అగ్రో ఫుడ్స్ లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకుSIPB చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
8. పరిశ్రమలు&వాణిజ్య శాఖ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి M/s అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి SIPB సమావేశంలో చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.1110 కోట్లుతో ఏర్పాటు చేసే ఈ కంపెనీ ద్వారా 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసే ఈ కంపెనీ నిర్మాణ పనులు 2027 డిశంబరు నాటికి పూర్తి కానున్నాయి.
9. పరిశ్రమలు&వాణిజ్య శాఖ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్‌పుట్‌ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి PPP పార్క్ పాలసీ కింద ప్రైవేట్ MSME ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికోసంSIPB సమావేశంలో (i) M/s వరహా ఆక్వా ఫార్మ్స్ (ii) M/s అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ALEAP ఇండియా) మరియు (iii) M/s జె కుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ల ప్రతిపాదనలకు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
(i) 93 ఎకరాల్లో ఏర్పాటు చేసే M/s వరహా ఆక్వా ఫార్మ్స్ ద్వారా రూ.32 కోట్ల పెట్టుబడితో 3500 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి (ii) చిత్తూరు జిల్లా కుప్పంలో 13.7 ఎకరాల్లో రూ.45 కోట్లు పెట్టుబడితో 2500 మంది ఉద్యోగ అవకశాలు కల్పించే విధంగా M/s అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ALEAP ఇండియా) సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది, మరియు (iii) విశాఖ జిల్లా పెందుర్తిలో 63.37 ఎకరాల్లో రూ.237 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు చేసే M/s జె కుమార్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 5 వేల మందికి ఉద్యగ అవకాశాలు కల్పించనుంది.
10. పరిశ్రమలు&వాణిజ్య శాఖ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్‌పుట్‌ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికిPPP పార్క్ పాలసీ కింద ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికోసం M/s IFFCO KISAN SEZ లిమిటెడ్ ప్రతిపాదనకు సంబంధించి ఇటీవల జరిగిన SIPB సమావేశంలో చేసిన సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.870 కోట్లు పెట్టు బడులతో ఏర్పాటు చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
11. పరిశ్రమలు&వాణిజ్య శాఖ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్‌పుట్‌ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికిఇటీవలి SIPBసమావేశంలో M/s HFCL లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు చేసిన సిఫార్సులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా మడకసిరలో రూ.1197 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ కంపెనీ ద్వారా 870 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
12. యువజన అభివృద్ది, పర్యాటక&సాంస్కృతిక శాఖ:
మంత్రాలయంలో M/s వెంకటేశ్వర లాడ్జ్ (మంత్రాలయం) ప్రైవేట్ లిమిటెడ్‌కు 3-స్టార్ హోటల్ (హిల్టన్-గార్డెన్ ఇన్ బ్రాండ్) అభివృద్ధికై ప్రోత్సాహకాలు అందించేందుకు SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం వలన రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
13. యువజన అభివృద్ది, పర్యాటక&సాంస్కృతిక శాఖ:
అమరావతిలో M/s మంజీర హాస్పిటాలిటీ (అమరావతి) ప్రైవేట్ లిమిటెడ్‌కు 4-స్టార్ హోటల్ (హాలిడే ఇన్ బ్రాండ్) అభివృద్ధికై ప్రోత్సాహకాలు అందించేందుకు SIPB సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం వలన రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ప్రత్యక్షంగా 225 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
14. యువజన అభివృద్ది, పర్యాటక&సాంస్కృతిక శాఖ:
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో M/s ENCALM వైజాగ్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 4-స్టార్ హోటల్ (తాజ్ వివాంతా బ్రాండ్) అభివృద్ధికై ప్రోత్సాహకాలు అందించేందుకు SIPBసమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం వలన రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
15. ఇంధన శాఖ:
శ్రీ సత్య సాయి జిల్లా NP కుంట మండలంమర్రికొమ్మదిన్నె గ్రామంలో AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఇతర డెవలపర్లచే రీన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీలకు కేటాయించిన / దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా M/s రెఫెక్స్ సోలార్ SPV ఫైవ్ లిమిటెడ్ కు (i) 100 MW AC / 140 MWp DC సోలార్ పవర్ కెపాసిటీ కేటాయింపుకు మరియు (ii) AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 నిబంధనల ప్రకారం 30 సంవత్సరాల కాలానికి లీజు రెంటల్స్ ఎకరానికి రూ. 31,000 చొప్పున ప్రతి రెండు సంవత్సరాలకు 5% పెంచేలా లీజు ప్రాతిపదికన ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంటే కేటాయింపునకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
16. ఇంధన శాఖ:
M/s క్లీన్ రీన్యూవబుల్ ఎనర్జీ (బార్మర్) ప్రైవేట్ లిమిటెడ్ సోలార్ ప్రాజెక్ట్ ను నంద్యాల జిల్లా కోటపాడు గ్రామం నుండి నంద్యాల జిల్లా, అవుకు మండలంలోని అవుకుగ్రామంకు మార్చేందుకు డెవలపర్లచే రీన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీలకు కేటాయించిన / దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్ ల్యాప్యింగ్ లేకుండా ఉండేలా చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా రూ.1500 కోట్ల పెట్టుబడులు, 950 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగనున్నాయి.
17. ఇంధన శాఖ:
శ్రీ సత్యసాయి జిల్లా ముత్తుకుంట గ్రామంలో రూ.800 కోట్ల పెట్టుబడితో 320 మందికి ఉద్యోగ అవకాశలు కలిగే విధంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి SIPB సిఫార్సులపై రెండు పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
18. ఇంధన శాఖ:
AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద SIPB సమావేశంలో చేసిన ఈ క్రింది రెండుసిఫార్సులు అనగా…
1 (i) M/s నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ద్వారా అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని గుజ్జిలి పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్ట్‌ను 1500 MW నుండి 2400 MWసామర్ధ్యానికి పెంచేందుకు; (ii) గుజ్జిలి PSP కోసం జలవనరుల శాఖ మార్గదర్శకాలు మరియు లభ్యతకు అనుగుణంగా చంపావతి నది నుండి గుజ్జిలి PSP కోసం వార్షిక ఎవాపరేషన్ నష్టాలకు సంబంధించి వన్‌టైమ్ ఫిల్లింగ్ మరియు 0.98 MCM కు 18.00 MCM నీటి కేటాయింపునకు మరియు
2- (i) AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద M/s చింత గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా YSR కడపజిల్లా, కొండాపురం మండలం, M/s చింత గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొప్పోలు పంప్డ్ స్టోరేజ్ పవర్ (PSP) ప్రాజెక్ట్‌ను 360 మెగా వాట్లనుండి 2400 మెగా వాట్ల సామర్ధ్యానికి పెంచేందుకు ; (ii) కొప్పోలు PSP కోసంనీటి కేటాయింపునకుజలవనరుల శాఖ ఆమోదంతో ఇప్పటికే ఉన్న గండికోట రిజర్వాయర్‌ను లోయర్ రిజర్వాయర్‌గా ఉపయోగించడానికి వన్‌టైమ్ ఫిల్లింగ్ మరియు గండికోట రిజర్వాయర్ నుండి కొప్పోలు PSP కోసం వార్షిక ఎవాపరేషన్ నష్టాలకు సంబంధించి 2.79 MCM కు 38.00 MCM నీటి కేటాయింపుకు వాటర్ రిసోర్సెస్ శాఖ మార్గదర్శకాలు మరియు లభ్యతకు అనుగుణంగా ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
19. ఇంధన శాఖ:
AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, 2024 కింద YSR కడప జిల్లాలోని జమ్మలమడుగు మరియు ముద్దనూర్ మండల్లాలోని గ్రామాలలో 100 మె.వావిండ్ కెపాసిటీ మరియు YSR కడప జిల్లా మైలవరం మండలంలోని గ్రామాలలో 60 మె.వా AC/ 84 M.Wp DC సోలార్ కెపాసిటీతో 100 మె.వావిండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ కోసం డెవలపర్లచే రీన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీలకు కేటాయించిన / దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా M/s హెక్సా ఎనర్జీ BH ఫైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
20. ఇంధన శాఖ:
AP ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద SIPB సమావేశంలో చేసిన ఈ క్రింది మూడుసిఫార్సులు అనగా –
(1) M/s బ్రైట్ ఫ్యూచర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు అనంతపురం జిల్లా రాయదుర్గం, బ్రహ్మసముద్రం, గుమ్మగట్ట మరియు కానేకల్ మండల్లాలోని గ్రామాలలో 349.80 MW విండ్ పవర్ కెపాసిటీ కేటాయింపునకు ; (2) డెవలపర్లచే రీన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీలకు కేటాయించిన / దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా అనంతపురం జిల్లాలో కుడైర్, ఉరవకొండ మరియు వజ్రకరూర్ మండల్లాలోని గ్రామాలలో M/s సెరెంటికా రీన్యూవబుల్స్ ఇండియా 24 ప్రైవేట్ లిమిటెడ్ కు 250 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపునకు; (3) డెవలపర్లచే రీన్యూవబుల్ ఎనర్జీ పవర్ కెపాసిటీలు మరియు విండ్ రిసోర్స్ అసెస్‌మెంట్ స్టడీలకు కేటాయించిన / దరఖాస్తు చేసిన ప్రాంతాలతో ఓవర్లాపింగ్ లేకుండా కర్నూల్ జిల్లాలో తుగ్గిలి, పత్తికొండ, దేవనకొండ, పండికొన మరియు అస్పరి మండల్లాలోని గ్రామాలలోM/s సెరెంటికా రీన్యూవబుల్స్ ఇండియా 25 ప్రైవేట్ లిమిటెడ్ కు300 MW విండ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపునకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
21. నీటి వనరుల శాఖ:
2024 ఆగస్టు మరియు సెప్టెంబర్‌లో వరదల కారణంగా సంభవించిన నష్టాలకు గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గంపేట, పిఠాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గోపాలపురం మరియు తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో రూ.5714.58 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (మేజర్&మైనర్)వరద నష్ట మరమ్మతు మరియు పునరుద్ధరణపనులకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
22. నీటి వనరుల శాఖ:
వాటర్ యూజర్స్ అసోసియేషన్లకు గుర్రపుడెక్క, కలుపు తొలగింపు పనుల (O&M వర్క్స్) అప్పగింపుకోసం రూ.5.00 లక్షల నుండి రూ.10.00 లక్షలకు ద్రవ్య పరిమితిని పెంచేందుకు ప్రభుత్వ మెమో నంబర్ ICD01- 325-CADA-2025 (2672792), తే.17-1-2025 జారీ చేసిన చర్యను ధృవీకరించే (ర్యాటిఫై) ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
23. గిరిజన సంక్షేమ శాఖ:
A.P. షెడ్యూల్డ్ తెగల కమిషన్ చట్టం, 2019 (యాక్ట్ నంబర్.30 ఆఫ్ 2020) మరియు యాక్ట్ నంబర్.25 ఆఫ్ 2023 సవరణల ప్రకారం సెక్షన్-6లోని సబ్-సెక్షన్ (1) మరియు సబ్-సెక్షన్ (3) ను సవరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం మరియు అభ్యున్నతికి అర్థవంతంగా దోహదపడే అధిక అర్హత కలిగిన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులకు ఇది అవకాశాన్ని అందిస్తుంది.
24. సాంఘిక సంక్షేమ శాఖ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ఉప సమూహాలలో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను అమలు చేయడానికి, సమాజంలో వారి ఏకీకృత మరియు ఏకరీతి పురోగతిని నిర్ధారించడానికి, A.P. ఆర్డినెన్స్ నెం.02 /2025 , తేదీ.17.04.2025 స్థానంలో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టబోయే ముసాయిదా బిల్లు ఆమోదం కోసం సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
25.ఇన్పర్మేషన్ టెక్నాలటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్ శాఖ:
SIPB సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని నాయుడుపేటలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB), కాపర్ క్లాడ్ లామినేట్ ప్లాంట్ (CCL)మరియు EMS ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి M/s సిర్మా SGS టెక్నాలజీ లిమిటెడ్ మరియు దాని జాయింట్ వెంచర్లకు 26.70 ఎకరాల భూమిని కేటాయించాలనే అభ్యర్థనను ఆమోదించేందుకు మరియు A.P. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 (2025-30) మరియు AP ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 (2024-29) కింద రూ.1,595 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి కోసం ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా 2,168 ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయ కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం మరియు పారిశ్రామిక సహకారాన్ని పెంపొందించడం ద్వారా MSME యూనిట్లకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
26.ఇన్పర్మేషన్ టెక్నాలటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్ శాఖ:
Α.Ρ. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 (2025-30) కింద ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీని స్థాపించడానికి మెస్సర్స్. హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేసిన ప్రాజెక్ట్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడానికి చేసిన అభ్యర్థనను ఆమోదించడానికి మరియు SIPB సిపార్సుల మేరకు రూ.586 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ముందస్తు ప్రోత్సాహకాలను అందజేయటం ద్వారా 613 ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ సౌకర్యం ఆపిల్‌తో సహా ప్రపంచ సాంకేతిక ప్రముఖులకు అధిక-నాణ్యత అల్యూమినియం ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. ఇది ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా చైన్ లో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని పెంచుతుంది. అదనంగా, ఈ పెట్టుబడి కొత్త వ్యాపారాలను సృష్టించడం ద్వారా స్థానిక MSME యూనిట్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. అవకాశాలు మరియు పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ అభివృద్ధి రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వృద్ధిని వేగవంతం చేయడానికి మరియు భవిష్యత్తులో దేశీయ మరియు విదేశీ పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది, అధునాతన తయారీకి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పాత్రను బలోపేతం చేస్తుంది.
27. రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ:
AP మోటార్ వెహికల్స్ టాక్సేషన్ యాక్ట్, 1963 లోని ఐదవ షెడ్యూల్‌లోని సీరియల్ నెం. I. (a) (i), (ii), (iii) ని సవరిస్తూ, రవాణా వాహనాలకు సంబంధించి "గ్రీన్ టాక్స్" రేటును తగ్గించడానికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ట్రాక్టర్ మరియు ట్రైలర్‌లతో సహా వస్తువుల క్యారేజీ (లాడెన్ బరువులో 3000 కిలోల కంటే తక్కువ ఉన్న 3 చక్రాల వస్తువుల క్యారేజీలు కాకుండా) వాహనాలు చెల్లించాల్సిన త్రైమాసిక పన్ను ఆధారంగా కాకుండా రూ.1,500 మరియు రూ.3,000/- గా కొత్త పన్ను రేట్లను నిర్ణయించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నంబర్ 4 ఆఫ్ 2025 స్థానంలో ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు, 2025 ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడానికి రవాణా, రహదారులు మరియు భవనాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
28.వ్యవసాయ మరియు సహకార శాఖ:
నెల్లూరు, నవాబ్‌పేటలోని నరుకూర్ - నెల్లూరు రోడ్డు ఎడమ వైపున ఉన్న ప్రస్తుత మార్కెట్ యార్డ్‌లో కొత్త కూరగాయల మార్కెట్ నిర్మాణం కోసం నెల్లూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన ఎకరాల 19.69 సెంట్ల భూమిని, కొత్తగా నిర్మించిన 5000 మెట్రిక్ టన్నుల గోడౌన్ మరియు హైవేకు అప్రోచ్ రోడ్డు మినహా నిర్దేశించిన షరతులతో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
29.పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ:
జాతీయ జల్ జీవన్ మిషన్ (NJJM) మార్గదర్శకాలకు అనుగుణంగా అనుబంధం-I-IVతో పాటు రూపొందించబడిన "ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సరఫరా పథకాల ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ (గ్రామీణ)" విధానాన్ని ఆమోదించడానికి మరియు నోటిఫికేషన్ జారీ చేయడానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఈ విధానం వలన రాష్ట్రవాప్తంగా నీటి వనరుల స్థిరమైన నిర్వహణ మరియు బాధ్యతాయుత వినియోగం, కమ్యూనిటీ-మేనేజ్డ్ వాటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ప్రోత్సహించబడుతుంది. మౌలిక సదుపాయాల దుర్వినియోగం మరియు నష్టాన్ని తగ్గించడానికి ఉత్తమ O&M పద్ధతులను అమలు చేసి ఆస్తుల జీవితకాలాన్ని పొడిగిస్తుంది. అన్ని గ్రామీణ కమ్యూనిటీలకు సురక్షితమైన తాగునీటిని న్యాయమైన మరియు స్థిరమైన అందుబాటును కల్పిస్తుంది. నీటి నాణ్యత పరీక్షలు మరియు భద్రతా చర్యలు ప్రజారోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు పైప్డ్ వాటర్‌పై నమ్మకాన్ని పెంచుతాయి. నీటి సంరక్షణ, మూల రక్షణ మరియు గ్రేవాటర్ నిర్వహణ చర్యలు దీర్ఘకాలిక నీటి స్థిరత్వాన్ని నిర్ధారిస్తాయి.
30.ఉన్నత విద్యా శాఖ:
గ్రీన్‌ఫీల్డ్ మరియు బ్రౌన్‌ఫీల్డ్ విశ్వవిద్యాలయాలు రెండింటికీ డిగ్రీల తప్పనిసరి ఉమ్మడి ధృవీకరణ అవసరాన్ని తొలగించి, రాష్ట్రంలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను నియంత్రించే నియంత్రణ చట్టసభ్య వ్యవస్థను క్రమబద్ధీకరించే దృష్టితో, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన మరియు నియంత్రణ) చట్టం, 2016 (చట్టం సంఖ్య 3 ఆఫ్ 2016) యొక్క సెక్షన్లు 3, 4, మరియు 5 నిబంధనలను సవరించడానికి మరియు సెక్షన్లు 2, 11-A, మరియు 33-A కింద ఉన్న నిబంధనలను తొలగించడానికి ఆర్డినెన్స్ ప్రకటనకు బదులుగా, అదే ముసాయిదా బిల్లును రానున్న ఆ.ప్ర. శాసనసభలో ప్రవేశపెట్టడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ నియమావళుల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన వల్ల మెరుగైన విద్యా ప్రమాణాలు, ఆర్థిక వృద్ధి మరియు మెరుగైన పరిశోధనా సామర్థ్యాలు వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
31.పురపాలక మరియు పట్టణాభివృది శాఖ:
అమరావతి రాజధాని నగరంలోని అమరావతి ప్రభుత్వ సముదాయ ప్రాంతం కోసం లేఅవుట్లలో ట్రంక్ మౌలిక సదుపాయాలకు అనుగుణంగా రోడ్లు, డ్రెయిన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్ & ICT కోసం యుటిలిటీ డక్ట్‌లు, పునర్వినియోగ వాటర్‌లైన్ &అవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణం కోసం L.1 బిడ్‌ను ఆమోదించడానికి APCRDA కమిషనర్‌కు అధికారం ఇవ్వడం, ఈ పనులను L1 బిడ్డర్‌కు అప్పగించడానికి LOA జారీ చేయడం మరియు APCRDA అథారిటీ వారి తీర్మానం నం.574/2025 ద్వారా ఆమోదించిన నిర్ణయాలను అమలు చేయడం కోసం పురపాలక మరియు పట్టణాభివృది శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
32.పురపాలక మరియు పట్టణాభివృది శాఖ:
"కృష్ణా నది యొక్క వివిధ రీచ్‌ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరం నుండి ఇసుకను డీసిల్టింగ్ చేయడం" అనే పనుల నామకరణాన్ని "కృష్ణా నది యొక్క వివిధ రీచ్‌ల వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరాన్ని డీసిల్టింగ్ చేయడం" అనే నామకరణంగా సవరించడానికి పురపాలక మరియు పట్టణాభివృది శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
33.పురపాలక మరియు పట్టణాభివృది శాఖ:
(i) "మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025" ఆమోదం కోసం మరియు (ii) రాజధాని ప్రాంతంలో రత్నాలు మరియు ఆభరణాల పార్క్ ఏర్పాటు చేసేందుకై గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలో 78.01 ఎకరాల విస్తీర్ణంలో "మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్"ను ప్రారంభించడానికి మరియు అమలు చేయడానికి APCRDA కమిషనర్‌కు అధికారం ఇచ్చేందుకై పురపాలక మరియు పట్టణాభివృది శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
34.రెవిన్యూ (భూములు) శాఖ:
G.O.Ms.No.84, రెవెన్యూ (భూములు-VI) శాఖ, తేదీ:24.02.2023 ప్రకారం థర్డ్ పార్టీల ఆక్రమణలో ఉన్న వ్యక్తులకు (347 మందికి) సంబంధించి అదనపు భూముల క్రమబద్ధీకరణ/కేటాయింపు ఆమోదం కోసం రెవిన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
35.రెవిన్యూ (భూములు) శాఖ:
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామంలో ఉన్న సర్వే నెం. 167-2 (ఏక.1.96 సెం.) ,171-3 (ఏక.4.01 సెం.)లలోని మొత్తం ప్రభుత్వ భూమిని Ac.5.97 సెం.లను APIIC కి బదిలీ చేసి, ఆ భూమిలో ఉచితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు రెవిన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
36.రెవిన్యూ (భూములు) శాఖ:
"అందరికీ ఇళ్ళు" విధానం ప్రకారం తిరుపతి జిల్లా తిరుపతి అర్బన్ మండలం సెట్టిపల్లి గ్రామంలోని ప్రతి ప్లాట్ యజమానికి కనీసం 2.00 సెంట్లు కేటాయించడానికై రెవెన్యూ (EA&AR) శాఖ G.O.Ms.No. 173, తేదీ 15.02.2019 కు పాక్షిక సవరణ చేసేందుకు రెవిన్యూ (భూములు) శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
37.రెవిన్యూ (ఎక్సైజ్) శాఖ:
ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం, 1968 లోని సెక్షన్ 19 (2) &సెక్షన్ 36 (1) (h) లను సవరిస్తూ, ఆ సెక్షన్లలో "కుష్టు వ్యాధి లేదా ఏదైనా ఇతర/ఇతర" అనే పదాలను తొలగించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
38.వినియోగదారుల వ్యవహారాలు, ఆహార &పౌర సరఫరాల శాఖ:
దీపం-2 పథకం కింద అర్హత కలిగిన 5 కిలోల LPG సిలిండర్లను 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్లుగా మార్చడానికి వినియోగదారుల వ్యవహారాలు, ఆహార &పౌర సరఫరాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
5 కిలోల సిలిండర్లు కలిగి ఉన్న లబ్ధిదారులకు గతంలో దీపం-2 కింద 14.2 కిలోల సిలిండర్లతో సమానంగా సబ్సిడీలు లభించలేదు. వారి ప్రాతినిధ్యాలను అనుసరించి, ప్రభుత్వం 14.2 కిలోల గృహ LPG కనెక్షన్లను అందించాలని నిర్ణయించింది, సమాన సబ్సిడీ ప్రయోజనాలను మరియు వంట గ్యాస్‌ను మెరుగైన ప్రాప్యతను నిర్ధారిస్తుంది.
ఈ నిర్ణయం వల్ల ఏఎస్‌ఆర్, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, నంద్యాల, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, ప్రకాశం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్‌ఆర్ కడప, పశ్చిమగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు 16 జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోని దాదాపు 23,912 మంది అర్హులైన కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.
39. పురపాలక&పట్టణాభివృద్ధి శాఖ:
ఆంధ్రప్రదేశ్ పట్టణ ప్రణాళిక చట్టం, 1920, మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం, 1955, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం, 2014, మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం, 2016 లకు సవరణలు చేయడం ద్వారా ఎత్తైన నివాస భవనాల గరిష్ట ఎత్తు పరిమితిని 18 మీటర్ల నుండి 24 మీటర్లకు పెంచడం మరియు రాష్ట్ర శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టడం కోసం క్యాబినెట్ నోట్‌కు అనుబంధంగా ఉన్న ముసాయిదా బిల్లు ఆమోదం కోసం పురపాలక & పట్టణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
40. ఆర్థిక శాఖ:
దేశ పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా GST వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రి మండలి అభినందలు తెల్పింది. జీఎస్టీ స్లాబ్ లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతించింది. విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెల్పింది. నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్యరంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడింది.
ఈ నిర్ణయం పేదలకు వరం, అభివృద్ధి కారకం. సమాజంలోని వేర్వేరు వర్గాలకు ప్రత్యేకించి రైతుల నుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుంది. పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతో పాటు ప్రతీ భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయనే అభిప్రాయాన్ని మంత్రి మండలి వ్యక్తం చేసింది.