ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సాగునీటి ప్రాజెక్టుల పేర్ల పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on  10 Aug 2024 6:00 AM GMT
AP Govt, irrigation projects, APnews

ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. సాగునీటి ప్రాజెక్టుల పేర్ల పునరుద్ధరణ

ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 సాగునీటి ప్రాజెక్టుల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అనేక నీటిపారుదల పథకాలు, ప్రాజెక్టుల పేరు మారనున్నాయి. ముఖ్యంగా గత వైఎస్సార్‌ పార్టీ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైసీపీ నేతల పేర్లను సాగునీటి ప్రాజెక్టులకు పెట్టింది.

అయితే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పేర్లనే పునరుద్ధరిస్తున్నట్టు తెలిపింది. వైఎస్‌ఆర్‌ పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టును గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుగా, వైఎస్‌ఆర్‌ వేదాద్రి ఎత్తిపోతలను ముక్త్యాల ఎత్తిపోతలుగా మార్చింది. అనంత వెంకట రెడ్డి హంద్రీ నీవా సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను హంద్రీ నీవా సుజల స్రవంతి (HNSS) ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పునరుద్ధరించనున్నారు. అలాగే వరికపూడిశెల, సంగం బ్యారేజీ, తాటిపూడి రిజర్వాయర్‌ పేర్లనూ పునరుద్ధరించింది.

Next Story