తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు వృద్ధుడు అయిపోతున్నారని, ఆయనకు ఓటు వేయొద్దని వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు అని అన్నారు. కొడుకునుపైకి తీసుకురావడం కోసం, రిటైర్మెంట్‌కు డబ్బు సంపాదించడం ఆయన ఎజెండా అని విమర్శలు చేశారు. ఆంధ్రుల కలలను ఆయన ఎలా నెరవేరుస్తాడు? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఏపీకి విధానపరమైన కొనసాగింపును తీసుకురాగల స్థిరమైన యుత నేత కావాలి అని పేర్కొన్నారు.
బీజేపీ, టీడీపీకి మధ్య ఎప్పుడూ సమన్వయం ఉండదని, ఒక కుటుంబమే బాగుపడుతుందని విమర్శించారు. విధాన పక్షవాతం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్తబ్దత, ప్రబలమైన అవినీతికి దారితీసే బిజెపి, టిడిపిల రెండు ఇంజిన్‌లు వ్యతిరేక దిశల్లో పనిచేస్తాయని గ్రహించడానికి ఏపీ ఇప్పటికే 2014-18 మధ్య “డబుల్ ఇంజిన్” సర్కార్‌ను చూసిందన్నారు. టీడీపీ హయాంలో 1 జిల్లా, 1 కులం, 1 కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందుతుందన్నారు.