ప్రభుత్వం మారాక.. ఇలా ఇబ్బందులు పెడుతున్నారు : కేతిరెడ్డి

ధర్మవరం పట్టణంలోని చిక్కవడియార్ చెరువును ఆక్రమించారని అధికారులు పంపిన నోటీసులపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు

By Medi Samrat  Published on  8 Nov 2024 9:20 AM GMT
ప్రభుత్వం మారాక.. ఇలా ఇబ్బందులు పెడుతున్నారు : కేతిరెడ్డి

ధర్మవరం పట్టణంలోని చిక్కవడియార్ చెరువును ఆక్రమించారని అధికారులు పంపిన నోటీసులపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నాటి నుంచి అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల భూములకు సంబంధించి అన్ని అంశాల్లోనూ క్లియర్ గా ఉన్నాయని, నీటి పారుదల శాఖ పంపిన నోటీసుల వెనక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు.

ఈ భూముల అంశంపై హైకోర్టులో కేసు విచారణ జరుగుతోందని, ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుంటే అధికారులు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు కేతిరెడ్డి హెచ్చరించారు. చెరువుకు సమీపంలో కొంత భూమి కొని దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించారని అధికారులు ఆరోపించారు. ఈ భూములు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోదరుడి భార్య గాలి వసుమతి పేరుతో ఉన్నాయని, ఆక్రమించిన భూమిని ఏడు రోజుల్లోగా ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు.

Next Story