కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు.. కేశినేని నానికి నచ్చుతుందా..?

Kesineni Sivanath Key Comments. ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండడంతో పలువురు ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు

By M.S.R  Published on  19 April 2023 4:47 PM IST
కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు.. కేశినేని నానికి నచ్చుతుందా..?

Kesineni Sivanath


ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండడంతో పలువురు ఆశావహులు తమ రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఆయా పార్టీల అధినాయకులు ఇప్పటికే పలువురు నాయకులకు హామీ ఇవ్వగా.. ఇంకొందరు తమ ప్రయత్నాలను వదిలిపెట్టడం లేదు. తాజాగా తెలుగుదేశం నేత కేశినేని శివనాథ్ (చిన్ని) ఎన్నికల్లో పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే తాను విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలుస్తానని అన్నారు. టికెట్ తనకిచ్చినా, వేరే ఎవరికైనా ఇచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించి తీరుతామని కూడా అన్నారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయటమే తమ అజెండా అని అన్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ నేత కేశినేని నాని ఉన్నారు. కేశినేని శివనాథ్‌కు కేశినేని నాని సోదరుడు అవుతారు. అలాంటిది ఇప్పుడు చిన్ని చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. కేశినేని చిన్నితో పాటు జిల్లాలో కొందరు టీడీపీ నేతలతో కేశినేని నానికి విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కేశినేని నాని వర్గానికి ఏ మాత్రం నచ్చవని అంటున్నారు.


Next Story