ఎలాంటి అసంతృప్తి లేదు : ఎంపీ కేశినేని నాని

Kesineni Nani denies reports over his dissatisfaction with TDP. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన అసంతృప్తి వార్తలను

By Medi Samrat
Published on : 15 Aug 2022 6:00 PM IST

ఎలాంటి అసంతృప్తి లేదు : ఎంపీ కేశినేని నాని

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన అసంతృప్తి వార్తలను విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ఖండించారు. ఈరోజు విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. స్వాతంత్య్రానంతరం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. కరోనా కారణంగా ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటే.. దానికి వ్యాక్సిన్‌ను కనిపెట్టి అందరికీ పంపిణీ చేసిన ఘనత భారత్‌కే దక్కిందని వెల్లడించారు.

కోహినూర్ వజ్రంతో సహా అన్నింటిని బ్రిటీషర్లు ఎత్తుకెళ్లారని అన్నారు. భారతదేశం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని.. ప్రపంచంలో వైద్యానికి భారతదేశం చిరునామాగా మారిందని అభిప్రాయపడ్డారు. తనపై కొందరు తప్పుడు వార్తలు సృష్టించడం తగదన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా లేకున్నా విజయవాడకు వచ్చే నష్టం లేదన్నారు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై కేశినేని నాని స్పందిస్తూ.. ఇది వ్యక్తిగత వ్యవహారం కాదని, మహిళలకు సంబంధించిన విషయమన్నారు.




Next Story