ఏకగ్రీవమే.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్‌

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంతో పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

By Medi Samrat  Published on  17 Aug 2024 8:35 PM IST
ఏకగ్రీవమే.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్‌

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంతో పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెప్టెంబర్‌ 8న ఏసీఏకు ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా నిన్న శుక్రవారం ఎన్నికల నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో ఏసీఏలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.

అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్, ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్‌ , కార్యదర్శిగా సానా సతీష్‌, జాయింట్‌ సెక్రటరీగా విష్ణు కుమార్‌రాజు, కోశాధికారిగా శ్రీనివాస్‌. కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్‌ ఎన్నికయ్యారు. అయితే తుది ఫలితాలను వచ్చే నెల 8న అధికారికంగా ప్రకటించనున్నారు.

Next Story