ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఏ ఊర్లో విగ్రహాలను ధ్వంసం చేస్తారో..! ఈ ఘటనలను అడ్డుకోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే పలు హిందూ సంస్థలు ఆలయాలలో విగ్రహాల ధ్వంసాన్ని ఖండిస్తూ ఉన్నాయి. పలు చోట్ల ధర్నాలను నిర్వహిస్తూ ఉన్నారు. విజయనగరంలో విగ్రహాల ధ్వంసంపై ధర్నా నిర్వహించగా.. అక్కడ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి కనిపించారు. అక్కడ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో కళ్యాణి కూడా పాల్గొని ఈ ఘటనలకు బాధ్యులను శిక్షించాలని కోరారు.

రాజమండ్రి శ్రీరాంనగర్‌లో విఘ్నేశ్వరాలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంలోని విగ్రహం రెండు చేతులను దుండగులు తొలగించారు. టీడీపీ నేత గన్ని కృష్ణ ఇంటికి సమీపంలో ఆలయం ఉండడంతో ఈ విషయాన్ని ఆయన పోలీసుల దాకా తీసుకుని వెళ్లారు. ఉద్దేశపూర్వకంగానే హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేశారు. రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానం పక్కనే సుమారు 800 అడుగుల ఎత్తులో ఉన్న బోడికొండపై కోదండ రామాలయం ఉంది. మంగళవారం ఉదయం అర్చకుడు వెళ్లేసరికి ఆలయ తలుపులకు తాళం లేకపోవడాన్ని గుర్తించారు. తల భాగం కోసం పరిసరాల్లో వెతికినా దొరకలేదు. పోలీస్‌ జాగిలాలు, క్లూస్‌ టీమ్‌ పక్కనే ఉన్న కొలనులో రాముడి తలను గుర్తించారు.


సామ్రాట్

Next Story