అదుర్స్ సినిమా చూపిస్తూ కాకినాడలో సర్జరీ

తెలుగు సినిమా లవర్స్ కు అదుర్స్ సినిమా అంటే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా అందులో బ్రహ్మానందం-ఎన్టీఆర్ కామెడీ ట్రాక్ అయితే సూపర్ హిట్ అయింది.

By Medi Samrat  Published on  18 Sept 2024 2:20 PM IST
అదుర్స్ సినిమా చూపిస్తూ కాకినాడలో సర్జరీ

తెలుగు సినిమా లవర్స్ కు అదుర్స్ సినిమా అంటే ప్రత్యేకమైన ఇష్టం. ముఖ్యంగా అందులో బ్రహ్మానందం-ఎన్టీఆర్ కామెడీ ట్రాక్ అయితే సూపర్ హిట్ అయింది. అందుకే ఈ సినిమాను రీరిలీజ్ సమయంలో కూడా చూడడానికి క్యూ కట్టారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) వైద్యులు జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం నటించిన 'అదుర్స్' సినిమాను చూపిస్తూ ఒక మహిళా రోగి నుండి మెదడు కణితిని విజయవంతంగా తొలగించారు. "అవేక్ క్రానియోటమీ" ద్వారా కణితి తొలగించారు.

తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి కుడి కాలు, కుడి చేయి బలహీనత వంటి లక్షణాలతో బాధపడుతూ ఉన్నారు. పలు ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకున్నా ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత తలనొప్పి, స్పృహ తప్పడం, శరీరం కుడివైపు తిమ్మిర్లు రావడంతో సెప్టెంబర్ 11న ఆమెను జీజీహెచ్‌లో చేర్చారు. వైద్యులు ఆమెను పరీక్షించి మెదడుకు ఎడమవైపున 3.3x2.7సెం.మీ కణితిని గుర్తించారు. ఆమెకు మంగళవారం శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించారు. అనంతలక్ష్మికి ఎంతో ఇష్టమైన ‘అదుర్స్’ సినిమాని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆ బాధ ఆమెకు తెలియకుండా ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు. సీనియర్ వైద్యుల పర్యవేక్షణలో రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్స తర్వాత, ఆమె కూర్చుని అల్పాహారం తీసుకోగలిగారు. జీజీహెచ్‌లో తొలిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు.

Next Story