క్వార్ట్జ్ అక్రమ మైనింగ్, రవాణా కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు హాజరవ్వలేదు. విచారణకు హాజరు కావాలంటూ కాకాణికి ఇప్పటి వరకు రెండుసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సోమవారంనాడు నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆదివారం నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళ్లిన రెండు సార్లు కాకాణి కనిపించలేదు.
సోమవారం కూడా విచారణకు కాకాణి హాజరవ్వలేదు. ఇందుకు సంబంధించి అధికారులకు సమాచారం పంపించారు. నెల్లూరులో ఓ కుటుంబ శుభకార్యం ఉందని, ఆ కార్యక్రమంలో పాల్గొంటానని కాకాణి తెలిపారు. గురువారం నుంచి తాను అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం అందించారు.