శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీకి మరో షాక్

టీడీపీకి మరో షాక్ తగిలింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

By Medi Samrat  Published on  31 March 2024 8:35 PM IST
శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీకి మరో షాక్

టీడీపీకి మరో షాక్ తగిలింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా సోమవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చాంద్ భాషా తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ భాషా మరోసారి పోటీ చేయాలని భావించినా.. అధిష్టానం కందికుంట వెంకటప్రసాద్ కు టికెట్ ఇవ్వడంతో చాంద్ బాషా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. మంత్రి పదవితో పాటు తగిన గుర్తింపును ఇస్తామని చంద్రబాబు మాట తప్పాడని మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా లేఖలో ఆరోపించారు. ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు గాని, బహిరంగ సభకు కానీ కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు.

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి కదిరి ఎమ్మెల్యేగా చాంద్ భాషా గెలుపొందారు. ఆ తర్వాత చాంద్ భాషా టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చాంద్ బాషా టీడీపీ టికెట్ ఆశించగా చంద్రబాబు మాత్రం కందికుంటకు కేటాయించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుఫున సిద్ధారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Next Story