కేఏ పాల్ కారు యాత్ర.. షెడ్యూల్‌ ఇదే

KA Paul car tour in AP and Telangana. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడమే

By అంజి  Published on  8 July 2022 4:30 PM IST
కేఏ పాల్ కారు యాత్ర.. షెడ్యూల్‌ ఇదే

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కారు యాత్ర చేపట్టబోతున్నారు. విశాఖపట్నం నుంచి కారు యాత్ర చేపట్టనున్నట్టు ఆయన పార్టీకి చెందిన స్టేట్‌ కో ఆర్డినేటర్‌ సుస్మిత తెలిపారు. జులై 9న వైజాగ్‌లో కేఏ పాల్‌ కారు యాత్ర ప్రారంభం కానుంది. విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం మీదుగా జులై 22 నాటికి కారు యాత్ర కర్నూలు చేరుకుంటుందని తెలిపారు.

ఈ యాత్రలో భాగంగా మధ్య మధ్యలో ఏర్పాటు చేసిన పలు వేదికల దగ్గర కేఏ పాల్‌ ప్రజలతో మాట్లాడనున్నారని, తమ పార్టీ ఆశయాలు, ఉద్దేశ్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ప్రజాశాంతి పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ యాత్రకు 'పాల్‌ రావాలి - పాలన మారాలి' అనే నినాదాన్ని ఖరారు చేశారు. మొన్నటి వరకూ తెలంగాణలో హల్‌చల్‌ చేసిన పాల్‌.. ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐ డైరెక్టర్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేసిన చేశారు.

ఏపీలో కారు యాత్రతో ప్రజలను తమ పార్టీ వైపు ఆకర్షించుకుంటామని పాల్ అంటున్నారు. గతంలో కూడా పాల్ ఇలాంటి యాత్రలు చేశారు. కానీ రాష్ట్రం మొత్తం ఒకేసారి ఎప్పుడూ పర్యటించలేదు. దీంతో ఆయన కారు పర్యటనపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఏపీలో పర్యటన ముగిసిన తర్వాత తెలంగాణలో కూడా కారు యాత్ర చేపడతామని కేఏ పాల్ చెప్పారు. జులై 23 నుంచి ఆగస్టు 1 వరకు తెలంగాణలో పాల్ పర్యటించనున్నారు. సెప్టెంబర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రజా శాంతి పార్టీ ప్రతినిధులు తెలిపారు.

Next Story