ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ లీసా గిల్ నియమితులు కానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. ప్రస్తుతం పంజాబ్-హర్యానా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న ఆమె, కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే అమరావతిలో బాధ్యతలు చేపట్టనున్నారు.
సాధారణంగా పదవీ విరమణ తర్వాతే కొత్త నియామకాలు జరిగేవి, కానీ ఈసారి న్యాయపాలనలో జాప్యం లేకుండా ఉండేందుకు ప్రస్తుత సీజే రిటైర్ కావడానికి రెండు నెలల ముందే కొలీజియం ఈ పేర్లను ఖరారు చేయడం విశేషం. ఇదే క్రమంలో మద్రాస్ హైకోర్టు సీజేగా జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి పేరును కూడా కొలీజియం ప్రతిపాదించింది.