ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బట్టు దేవానంద్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. జస్టిస్ దేవానంద్ బట్టు రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది. ఈయన పదవీకాలం 2028 ఏప్రిల్ 13వరకు ఉంది. కాగా జస్టిస్ దేవానంద్ మద్రాస్ న్యాయస్థానం నుంచి ట్రాన్స్‌ఫర్‌పై ఏపీ హైకోర్టుకు వచ్చారు.