టెన్షన్.. టెన్షన్.. రేపు ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.
By M.S.R Published on 20 Sept 2023 6:34 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన చంద్రబాబును ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. సీఐడీ తరుఫున అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబును కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తుందని సీఐడీ తరుఫు న్యాయవాది వాదించగా.. చంద్రబాబును పోలీసుల కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. మూడు గంటలపాటు పాటు వాదనలు విన్న విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి తీర్పును రేపటికి వాయిదా వేశారు. గురువారం ఉదయం 11.30 గంటలకు చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తామని జడ్జి తెలిపారు.
చంద్రబాబును పిటి వారెంట్లపై ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారించాలని సిట్ మెమో దాఖలు చేసింది. మంగళవారం ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబు పేరును చేర్చారు. మొదట కస్టడీ పిటిషన్లపై విచారిస్తామని, తర్వాత బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపతామని కోర్టుకు తెలిపారు. పీటీ వారెంట్లపై విచారణ కోసం ఒత్తిడి చేయొద్దని న్యాయమూర్తి సూచించారు.