టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఓ అరుదైన దృశ్యం కనబడింది. జేసీ ప్రభాకర్ రెడ్డి.. పరిటాల శ్రీరామ్‌ను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. నారా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేపీ ప్రభాకర్ రెడ్డి చేరుకున్నారు. అదే సమయంలో పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చారు. ఈ సందర్భంలోనే ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. భుజాలపై చేతులు వేసుకుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అనంతపురం జిల్లాలో పరిటాల వర్గానికి, జేసీ వర్గానికి ఎన్నో ఏళ్లుగా శత్రుత్వం ఉంది. ఇరు వర్గాలు వేరేవేరు పార్టీల్లో ఉన్నప్పుడు పడేది కాదు. పరిటాల హత్య విషయంలోనూ అప్పట్లో జేసీ కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. జేసీ వర్గం టీడీపీ చేరిన తర్వాత వీరు కలవడం తరచుగా జరిగేది. అంతకుముందు జేసీ వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉండేది. పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్ ఆప్యాయంగా పలకరించుకోవడంతో ఇరు వర్గాలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా పాలిటిక్స్‌లో పరిటాల, జేసీ వర్గాలు బద్ధ శత్రువులుగా ఉండేవి.