జనసేనలో చేరిన బద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 April 2024 2:10 PM GMTజనసేనలో చేరిన బద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలు పార్టీల నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసద్ జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిమ్మక జయకృష్ణ, రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన ఉక్కావారిపల్లె సర్పంచ్ అరవ శ్రీధర్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన వారు జనసేన పార్టీలో చేరారు.
కాగా.. అవనిగడ్డ నుంచి జసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా బుద్ధప్రసాద్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. బుద్ధప్రసాద్ పేరే దాదాపుగా ఖరారు అయ్యిందని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. జనసేనకు అవనిగడ్డ స్థానం కేటాయించడంతో సరైన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ గట్టిగా ప్రయత్నించారు. విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. బుద్ధా ప్రసాద్‌తో పాటు పలువురి పేర్లను పరిశీలించారు. గతంలో మూడుసార్లు ఎన్నికోలో గెలిచిన బుద్ధప్రసాద్‌కు అక్కడ మంచి పట్టు ఉందనీ.. దాంతో.. ఆయనకే టికెట్ ఇస్తే గెలిచేందుకు అవకాశాలు ఉన్నట్లు పార్టీ భావిస్తోంది.
జనసేనను అర్థం చేసుకుని పార్టీలో చేరిన ఇతర పార్టీల నాయకులు, మేధావులు, విభిన్న వర్గాల వారికి స్వాగతం పలుకుతున్నానని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనను, కాకినాడ పార్లమెంట్ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను గెలిపించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి తనని గెలిపిస్తే దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలోనే ఉన్న గ్రామాల్లో ఏదో ఒక దాంట్లో ఇల్లు తీసుకుంటానని పవన్ చెప్పారు. ఇక గాజుగ్లాసు పగిలేకొద్ది పదునెక్కుతుందనీ అన్నారు. వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అంటూ అధికారపార్టీపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు.
జనసేనలో చేరిన మాజీ మంత్రి, మాజీ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్. ఈ రోజు పిఠాపురంలో ఆయనకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. pic.twitter.com/AaEswwC2xE
— JanaSena Party (@JanaSenaParty) April 1, 2024
పాలకొండ నియోజక వర్గానికి చెందిన శ్రీ నిమ్మక జయకృష్ణ జనసేనలో చేరారు. ఈ రోజు పిఠాపురంలో ఆయనకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.#HelloAP_ByeByeYCP pic.twitter.com/3uLyoxfIHC
— JanaSena Party (@JanaSenaParty) April 1, 2024